forest range officer Srinivas Rao Served eviction notice To Gutti Koyas
mictv telugu

గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు!

November 28, 2022

forest range officer Srinivas Rao Served eviction notice

కలకలం రేపిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. రెండు దశాబ్దాలుగా ఎర్రబోడులో ఉంటున్న గుత్తికోయలను ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు ఇచ్చిట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులో ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గుత్తికోయలు ఘర్షణలో శ్రీనివాసరావును చంపినట్లు కేసు నమోదవడం, నిందితులను అరెస్ట్ చేయడం తెలిసిందే. గుత్తికోయలను సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు బెండాలపాడు పంచాయతీ తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం అటవీశాఖ అధికారులు గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చినల్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు తమ ఇళ్లకు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకున్నారని, తర్వాత వాటిని పీకేశారని గిరిజనులు చెబుతున్నారు. కాగా, ఇద్దరు చేసిన తప్పుకు మొత్తం గూడేన్ని ఖాళీ చేయాలనడం సరికాదని గుత్తికోయలు వాపోతున్నారు. తాము చచ్చినా అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. తమకు రేషన్ కార్డులు, ఓటు హక్కు కల్పించి, ఇప్పుడు వెళ్లిపోవాలనడం సరికాదంటున్నారు. సల్వాజుడుం ఆగడాలు భరించలేక 2003లో ఛత్తీస్‌గఢ్ నుంచి పొట్టచేతబట్టుకుని వచ్చిన గుత్తికోయలు ఎర్రబోడులో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతం 45 ఇళ్లు ఉన్నాయి. సాగుతోపాటు చిన్నాచితకా కూలి పనులు చేసుకుంటున్నారు