Forest rangers want their guns back
mictv telugu

వారికి ఆయుధాలు ఇవ్వాల్సిందేనా?

November 23, 2022

Forest rangers want their guns back

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో భయంకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్నెళ్ల ముందే హత్యకు గుత్తికోయలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. వీరికి మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని గతంలో పలుమార్లు శ్రీనివాసరావు చెప్పారంటున్నారు అటవీశాఖ సిబ్బంది. ఫారెస్ట్ రేంజర్ హత్యతో ఆయుధాలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు ఇస్తుందా? దాడుల నుంచి వారికి రక్షణ ఎలా కల్పించబోతోంది?

నిక్కచ్చిగా…

డ్యూటీలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా ఉండేవారని పేరుంది. తన రేంజ్‌లో పుల్లను కూడా బయటకు తీసుకుపోనిచ్చేవారుకాదు. శ్రీనివాసరావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు వివరిస్తున్న వీడియో వైరల్ అవుతుంది.లింగాలలో పనిచేస్తున్నప్పుడే శ్రీనివాసరావు హిట్ లిస్టులో ఉన్నాడు.అప్పటి నుంచి గుత్తికోయలు ఆయన హత్యకు ప్లాన్ చేశారని అటవీశాఖ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువుల మేపనీయనందుకే చంపేశారని టాక్ వినిపిస్తోంది.

వెంటాడి..వేటాడి….

Forest rangers want their guns back

భద్రాద్రి కొత్తగూడెంలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుని మంగళవారం వేటకొడవళ్లతో నరికి చంపారు. ప్లాంటేషన్ మొక్కల్ని గుత్తికోయలు నరుకుతుండగా ఆయన అడ్డుకున్నారు. దీంతో గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లు, వేటకొడవళ్లతో శ్రీనివాసరావుపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీవానిసరావుకు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు చనిపోయారు.

ఆయుధాలు ఇవ్వాల్సిందే

Forest rangers want their guns back

రేంజర్ మర్డర్‌తో మరోసారి ఆయుధాల అంశం తెరపైకి వచ్చింది. ఫారెస్ట్ అధికారులకు మళ్లీ తుపాకులు ఇవ్వాలని సిబ్బందికోరుతున్నారు.ఇలాంటి దాడుల నుంచి రక్షించుకోవాలంటే ఆయుధాలు తప్పనిసరి అని అంటున్నారు.గతంలో పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్‌ని సీఎం ముందు ఉంచుతామంటున్నారు.ప్రాణాలకు తెగించి అడవుల్ని రక్షిస్తున్నవారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. దాడుల నుంచి రక్షించుకోవడానికి ఆయుధాలు ఇవ్వాల్సిందే. లేకుంటే భవిష్యత్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.