దారి తప్పిన మంత్రి..! - MicTv.in - Telugu News
mictv telugu

దారి తప్పిన మంత్రి..!

July 27, 2017

అది ఒక దట్టమైన అడవి..ఆ అడవి దగ్గరలో హారిత హారం కార్యక్రమాన్ని చేపట్టడానికి వెళ్లిన అటవీ శాఖా మంత్రే అదృశ్యమైన వేళ,అసలేం జరిగింది..సాక్ష్యాత్తూ మంత్రే తప్పిపోవడానికి కారణం ఏంటి?మంత్రికోసం అటు పోలీసులు బలగాలు,ఇటు ఆయన సన్నిహితులు గంటకు పైగా దేవులాడిన వైనం.అసలేం జరిగిందంటే..

అటవీ శాఖా మంత్రి జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి,జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి ,మురళీధర్ యాదవ్,ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలెక్టర్ భారతీహోలికేరిలతో కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మొక్కలు నాటేందుకు  వెళ్లారు.మొక్కలు నాటాకా.. నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పరుపు బండ వద్ద భోజనాలకోసం అందరూ కాలినడకన బయలుదేరారు, అయితే  మంత్రి జోగురామన్నతో పాటు  ఎమ్మెల్యే మదన్ రెడ్డి  ఇతరులు కలిసి  ముచ్చటవెట్టుకుంట మూడు కిలోమీటర్లు దారితప్పి నడుచుకుంటూ వెళ్లారట,అయితే భోజన స్థలానికి చేరుకున్న పద్మాదేవేందర్ రెడ్డి ఇతరులు… మంత్రిగారి కోసం ఎదురు చూసి.. రాకపోయే సరికి…కంగారు పడి..ఫోన్ చేస్తే ఫోన్ సిగ్నల్ కూడా అందలేదట… గంటసేపు పోలీసులు అడవంతా గాలించి ఎట్టకేలకు జోగురామన్నను మరియు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని క్షేమంగా భోజనా స్ధలానికి తీసుకెళ్లారట.ఈవిధంగా అటవీ శాఖా మంత్రి.. అటవీ ప్రాంతంలో దారి తప్పి కొద్దిసేపు అందరిని కంగారు పెట్టారన్నమాట.