వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు, కేసు నమోదు  - MicTv.in - Telugu News
mictv telugu

వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు, కేసు నమోదు 

December 9, 2019

rgv varma

వివాదాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. ఆయన తమ ప్రతిష్టతోపాటు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా బజారుకు లాగారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కోడలు బెగాల్‌ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వర్మ తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ప్రచారం కోసం ఆయన తమ ఫోటోలను మార్ఫింగ్ చేశారని ఆమె సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. 

 

తాము గతంలో  ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫోటోను వర్మ మార్చేసి, తాము ఆయనకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్టుగా చూపారని జ్యోతి వివరించారు. తమ అనుమతి తీసుకోకుండా తమ ఫోటోను తప్పుగా ప్రచారం చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఆమె పోలీసులను కోరారు. వర్మ తన ఖాతాలో పోస్టు చేసిన మార్ఫింగ్‌ ఫొటోను తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు వర్మపై ఐపీసీ 469 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మార్ఫ్ చేసిన కంప్యూటర్‌ను గుర్తించేందుకు సాయం చేయాలని గూగుల్‌ను కోరారు. అ.రా.క.బి. చిత్రానికి కొన్ని కత్తిరింపులతో సెన్సార్ బోర్డు అనుమతివ్వడం తెలిసిందే. చిత్రంలో తన పరువు తీసే సీన్లు ఉన్నాయని పాల్ కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో వర్మ.. తనకు పాల్ స్వయంగా సెన్సార్ సర్టిఫికెట్ అందజేశారంటూ మార్ఫింగ్ ఫోటోను తయారు చేయించారు.