Forgetting everything? But this is for you…
mictv telugu

అన్నీ మర్చిపోతున్నారా? అయితే ఇది మీ కోసమే…

November 10, 2022

ఇప్పడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ లో మతిమరుపు ఒకటి. మనం రోజూ వాడుతున్న వస్తువులనే ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, తేదీలు, ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతుంటారు. ఇవి చాలా మందిలో చాలా కామన్ గా ఉండేది. అయితే ఇలా మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. వాటివల్ల మనలోని జ్ఞాపకశక్తి పెరుగుతుందిట. ఆయుర్వేద వైద్యం పరంగా చెప్పే ఈ పదార్ధాలు మన బ్రెయిన్లకు సొల్యూషన్స్ అంటున్నారు.

మన శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండి సరిగ్గా పనిచేసేందుకు కూడా పోషకాహారం అవసరం. ఇందుకోసం మంచి ఆహారాలు చాలా ఉన్నాయి. వీటిని రోజూ మన డైట్లో చేర్చుకోవడమే మనం చేయాల్సిన పని. నెయ్యి, ఆలివ్ ఆయిల్, వాల్ నట్, నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, తాజా పళ్ళు రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే మన మెదడు ఆరోగ్యానికి పప్పులు, బీన్స్, పనీర్, తృణధాన్యాలు కూడా చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం, జీలకర్ర మన మెదడుని బాగా పనిచేసేలా చేస్తుంది. నల్ల మిరియాలు మనసు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇక ఆయుర్వేద మూలికలు మానవ మెదడుకి మంచి చేస్తాయి. ధీ, ధృతి, స్మృతి. గోటు కోలా, అశ్వగంధ, బాకోపా వంటి మూలికలు జ్ఞాపకశక్తిని పెంచేలా చేస్తాయిట.

మన శరీరం దాని విధులను సరిగ్గా నిర్వహించడానికి తగినంత నీరు లేనప్పుడు, బలహీనంగా, అస్థిరంగా అయిపోతాము. దీనికోసం ఆయుర్వేద నిపుణులు ఓ హెర్బల్ టీ ని సజెస్ట్ చేస్తున్నారు. దీన్ని తాగడం వల్ల మన మెదడు హైడ్రేట్ అవుతుందని, మానసిక శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుందని సిఫార్సు చేస్తున్నారు. ఇంగువ, పసుపు, వాము, తులసిలను కప్పు నీటిలో పోసి కాసేపు మరిగించి తాగాలి. ఇది మన మెదడును చురుకుగా ఉంచుతుంది అంటున్నారు.

 

అలాగే నిద్రలేకపోవడం కూడా మెదడు పనితీరుని ఎక్కువగా దెబ్బతీస్తుంది. నిద్రలేమి జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను దెబ్బతీస్తుంది. అందువల్ల రోజూ రాత్రి తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని, ఉదయం మేల్కొవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. నిద్ర పట్టడం ఇబ్బందిగా అనిపిస్తే ఆయుర్వేద మూలిక బకోపాని వాడితే చాలా మంచిది. ఈ మూలికను సరిగ్గా వాడితే మెదడు శాంతపరిచి, నిద్ర హాయిగా పుతుంది.

ఇవన్నీ మన ఇంట్లోనే దొరికేవి. కొన్ని ఆయుర్వేద షాపుల్లో దొరికేవి కూడా. అయితే సమస్య తీవ్రంగా లేని వాళ్ళు మాత్రమే వీటిని వాడితే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి బాగా తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ల దగ్గరకు వెళితేనే మంచిదని చెబుతున్నారు. ఇంట్లో వైద్యం అన్నివేళలా మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముందు మన సమస్య తీవ్రతను గుర్తించాలి. తర్వాత దాన్ని బట్టి వైద్యం మొదలెట్టాలి.