Former Araku MP Kothapalli Geetha sentenced to five years in jail
mictv telugu

బ్యాంకుకు 42 కోట్ల ఎగనామం.. అరకు మాజీ ఎంపీకి ఐదేళ్ల జైలు శిక్ష

September 14, 2022

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకి హైదరాబాద్ సీబీఐ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 42.79 కోట్ల మేర మోసం చేసిన కేసులో కోర్టు ఈ శిక్ష విధించగా, 2015లోనే ఈ కేసుకు సంబంధించి సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. వీరితో పాటు బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్‌లకు కూడా ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. అంతకుముందు బుధవారం వీరిని అరెస్ట్ చేసిన సీబీఐ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత చంచల్ గూడ జైలుకి తరలించనున్నారు. అటు బెయిల్ కోసం కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ బుధవారమే విచారణకు వచ్చే అవకాశముంది.