విడాకులిచ్చిన మాజీ క్రికెటర్..రూ.192 కోట్ల పరిహారం కట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులిచ్చిన మాజీ క్రికెటర్..రూ.192 కోట్ల పరిహారం కట్టాడు

February 13, 2020

xvfb c

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఆయన భార్య కైలీ నుంచి విడాకులు తీసుకున్నాడు. 2012 మేలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో గత ఐదు మాసాలుగానే విడివిడిగా ఉంటున్నారు. 

‘కొన్ని రోజులు విడివిడిగా జీవించి, పరస్పర ఆమోదంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ వారు తెలిపారు. పాప భవిష్యత్ గురించి ఇద్దరూ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. విడాకుల కోసం పరిహారంగా భార్య కైలీకి రూ.192 కోట్ల ఆస్తులు ఇచ్చేందుకు మైకెల్ క్లార్క్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు కోర్టుకు బయట వారిద్దరు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.