Former Chief of Naval Staff Admiral Ramdas participated in Rahul JODO yatra
mictv telugu

రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నేవీ ఛీఫ్

November 3, 2022

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత జోడో పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా గణేష్‌ గడ్డ నుంచి రాహుల్‌ పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఇవాళ 25 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. చేర్యాల, కంది, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఫసల్వాదీ మీదుగా శివంపేట వరకు రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది.

చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటే చేశారు. ఈనేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నేవి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాల వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి చేతిలో చేయివేసి రామదాసు సతీ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్ పాద యాత్రకు మద్దతు పలుకుతూ ముందుకు సాగారు.

రాహుల్ గాంధీ ఈరోజు తన పాదయాత్రను పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. రోజూ ఉదయం 5.55 నిమిషాలకు మొదలయ్యే యాత్ర.. ఈరోజు మంచు కారణంగా పదినిమిషాలు ఆలస్యంగా షురూ అయ్యింది. భారత్‌ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజనాథ్, జగ్గారెడ్డి, రేవంత్‌ రెడ్డి. సీతక్క, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాహుల్‌ తో కలిసి ముందుకు సాగుతున్నారు.