Pulwama Attack: పుల్వామా దాడి తరహాలోనే మరో కుట్ర...భగ్నం చేసిన భద్రతా దళాలు..!! - Telugu News - Mic tv
mictv telugu

Pulwama Attack: పుల్వామా దాడి తరహాలోనే మరో కుట్ర…భగ్నం చేసిన భద్రతా దళాలు..!!

February 26, 2023

పుల్వామా దాడి తరహాలోనే మరోభారీ కుట్రకు ప్రయత్నించిన ఉగ్రవాదులు. అయితే ఉగ్రవాదుల దుశ్చర్యను ముందే పసిగట్టిన భద్రతా దళాలు ఆ కుట్రను భగ్నం చేశారని మాజీ చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్ (రిటైర్డ్) తన ‘కిత్నే ఘాజీ ఆయే, కిత్నే ఘాజీ గయే’ పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. పుల్వామా లాంటి మరో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు చాలా మందికి తెలియదు, అయితే ఈ జైష్ ఉగ్రవాదుల మాడ్యూల్ గురించి గూఢచార సంస్థలకు సమాచారం అందడంతో, సైన్యం, భద్రతా సంస్థల బృందం ఉగ్రవాదులను హతమార్చింది” అని ధిల్లాన్ పేర్కొన్నాడు.

స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ (RR) యూనిట్‌తో ఉగ్రవాదుల గురించి ఇన్‌పుట్‌లను పంచుకున్నందుకు, ఆపరేషన్‌కు నాయకత్వం వహించినందుకు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ అమన్ కుమార్ ఠాకూర్‌కు లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్ ఘనత ఇచ్చారు. ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల బృందం 24 ఫిబ్రవరి 2019 రాత్రి జాయింట్ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు ధిల్లాన్ చెప్పారు.

ఆపరేషన్ సమయంలో ఆర్మీ జవాన్ బల్దేవ్ రామ్ తీవ్రవాదుల బుల్లెట్లకు గాయపడ్డారని ధిల్లాన్ చెప్పారు. అమన్ ఠాకూర్ గాయపడిన సైనికుడిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాడు, అయితే ఉగ్రవాదులు దాక్కుని కాల్పులు జరపడంతో అతనికి గాయాలయ్యాయి. ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం ప్రదర్శిస్తూ అమన్ కుమార్ ఠాకూర్ ఉగ్రవాదిని చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది నోమన్ హతమయ్యాడు. పాకిస్తాన్ ఉగ్రవాది ఒసామాను హతమార్చి, ఎదురుకాల్పుల్లో దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన 34 RR నాయబ్ సుబేదార్ సోంబిర్ శౌర్యాన్ని గురించి కూడా ధిల్లాన్ ప్రస్తావించాడు. DSP ఠాకూర్, నాయబ్ సుబేదార్ సోంబిర్ ఇద్దరూ వారి అచంచలమైన ధైర్య సాహాసాలకు గానూ శౌర్య చక్రను ప్రదానం చేశారు.

ఫిబ్రవరి14, 2019న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు.