Home > Featured > కుమారస్వామి భార్య సినిమా వచ్చేస్తోంది.. 

కుమారస్వామి భార్య సినిమా వచ్చేస్తోంది.. 

kumaraswamy wife radhika movie.

రాధికా కుమారస్వామి! ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారు కదూ. మీరు ఊహించింది నిజమే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య రాధికనే. ఆమె నటించిన తాజా చిత్రం ‘దమయంతి’ ఈ నెల 20న విడుదల కానుంది.కన్నడంతోపాటు తమిళం, హిందీ, మలయాళం, తెలుగులోనూ వస్తోంది. 1980ల నేపథ్యంలో లేడీ ఓరియంటెండ్ మూవీగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో రాధిక మూడు పాత్రల్లో కనిపిస్తుంది. నవరసన్ ఈ సినిమాకు నిర్మాతా, దర్శకుడూ. ఇందులో రాధికతోపాటు నటుడు విశాల్ తండ్రి జీకే రెడ్డి, అనుషా రవి, సాధు కోకిల తదితరులు నటించారు. రాధిక గతంలో నటించిన భైరదేవి సినిమా హిట్టయింది. దీన్ని కూడా తెలుగులోకి తర్జుమా చేస్తున్నారు. రాధిక ‘భద్రాద్రి రాముడు’, ‘అవతారం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే.

Updated : 6 Sep 2019 6:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top