82 ఏళ్ల వయస్సులో మాజీ సీఎం 12th పాస్...! - MicTv.in - Telugu News
mictv telugu

82 ఏళ్ల వయస్సులో మాజీ సీఎం 12th పాస్…!

May 17, 2017

ఆయనో మాజీ సీఎం..జైలే స్కూలు. కటకటాల్లోనే సాధన.శిక్ష అనుభవిస్తూనే పరీక్ష రాశారు. మొత్తానికి 12 వ తరగతి పాసయ్యారు. ఆయనే లోక్ ద‌ళ్ పార్టీ నేత‌, మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా.

సుమారు మూడు వేల టీచ‌ర్లకు ఉద్యోగాలు ఇప్పించేందుకు డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేశార‌ని మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా పై ఆరోప‌ణలు ఉన్నాయి.ఈ కేసులో ఆయన శిక్ష అనుభ‌విస్తూనే 12 వ తరగతి ప‌రీక్ష రాశారు. 82 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న ప‌రీక్ష పాస్ కావ‌డం విశేషంగా మారింది. హ‌ర్యానా రాష్ట్రానికి ఓం ప్ర‌కాశ్ నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా చేశారు. ఢిల్లీలోని తిహార్ జైలులో ఆయ‌న ప‌రీక్ష రాశారు.

జైలు జీవితం అనుభ‌విస్తున్న త‌న తండ్రి ఆ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకున్నార‌ని ఆయ‌న కుమారుడు అభ‌య్ చౌతాలా చెబుతున్నారు. రోజూ జైలులో ఉన్న లైబ్ర‌రీకి వెళ్లి చ‌దువుకున్నారన్నారు. ప్ర‌తి రోజూ న్యూస్ పేపర్లు, పుస్త‌కాల‌ను చ‌దువుతార‌ని, గొప్ప రాజ‌కీయ వ్య‌క్తుల‌కు సంబంధించిన పుస్త‌కాల‌ను కూడా ఆయ‌న చ‌దువుతున్న‌ట్లు అభ‌య్ చెప్పారు.

HACK:

  • Former Haryana Chief Minster Om Prakash Choutala has passed his 12th class, while serving out his sentence in Delhi’s Thihar Jail.