బీజేపీలో చేరనున్న హార్ధిక్ పటేల్.. డేట్ ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో చేరనున్న హార్ధిక్ పటేల్.. డేట్ ఫిక్స్

May 31, 2022

అంతా అనుకున్నట్లే పాటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జూన్ 2న బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొన్నేళ్ల క్రితం గుజరాత్లో జోరుగా సాగిన పాటీదార్ ఉద్యమంలో హార్దిక్ కీలక పాత్ర పోషించారు. 2019లో ఆయన కాంగ్రెస్లో చేరారు. అయితే.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందే.. హార్దిక్ కాంగ్రెస్పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. పేరుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ నేత‌లు సైతం హార్ధిక్ ప‌టేల్ రాజీనామా చేస్తూ.. బీజేపీ స్క్రిప్ట్ చ‌దివారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జరిగింది . ఇప్పుడు అదే నిజం చేస్తూ హార్ధిక్ గురువారం బీజేపీలో చేరునున్నారు.