శ్రీలంక తరహా పరిస్థితులు రావొచ్చన్న అంచనాలున్న పాకిస్తాన్లో ఆ తరహా సంకేతాలు కనిపిస్తున్నాయి. మెల్లగా ప్రజల నుంచి అసంతృప్తి బయటకు వస్తోంది. ఇందుకు ఆ దేశ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలే నిదర్శనం. మహమ్మద్ హఫీజ్ అనే మాజీ పాక్ కెప్టెన్ 2017లో ఆ దేశానికి టీ20 ప్రపంచకప్ అందించి రికార్డు సృష్టించాడు. దాంతో పాటు అనేక ఘనతలను తన పేర లిఖించుకున్న హఫీజ్ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘లాహోర్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకడం లేదు. ఏటీఎం మెషీన్లలో డబ్బు లేదు. మీరు తీసుకునే చెత్త నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలా? నా ప్రశ్నకు ఈ దేశ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని సూటిగా ప్రశ్నించారు. తన ట్వీట్‌ను ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్, పంజాబ్ సీఎం, విదేశాంగ మంత్రికి ట్యాగ్ చేశాడు. ఇదిలా ఉండగా, పాక్ త్వరలోనే శ్రీలంక తరహా పరిస్థితులను ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, ఆ దేశంలోని మేధావులు కూడా సమీప భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నారు.