బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌ ను ఐపీఎల్లో ఆడనివ్వండి - MicTv.in - Telugu News
mictv telugu

బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌ ను ఐపీఎల్లో ఆడనివ్వండి

May 15, 2017

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం మేరకు రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌, ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌ ఐపీఎల్‌ను వీడారు. ఈ నేపథ్యంలో మాజీ ఇంగ్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ వారిద్దరిని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డును కోరాడు.

ముంబయి, పుణె జట్లు ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. ఇంగ్లాండ్‌ బోర్డుతో ఉన్న ఒప్పందాల కారణంగా ఈ ఇరువురు ఆటగాళ్లు ఇప్పటికే భారత్‌ వదలి వెళ్లిపోయారు. దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌ ఆ తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు బోర్డు నుంచి వీరికి పిలుపువచ్చింది.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్‌ శిక్షణ నిమిత్తం స్పెయిన్‌ వెళ్లనుంది. ఈ క్రమంలో పీటర్సన్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందించాడు. ‘ఐపీఎల్‌-10వ సీజన్‌లో చివరి దశ మ్యాచ్‌లు ఆడకుండా స్పెయిన్‌లో గడిపేందుకు స్టోక్స్‌, బట్లర్‌ వెళ్లడం చాలా దురదృష్ణకరం.’ అని పీటర్సన్‌ అన్నాడు.

 

HACK:

  • Former England Cricketer Kevin Peterson Requests England Cricket Board to let play Ben Stokes and Butler in IPL Cricket