Former England cricketer Monty Panesar joins the calls to boycott Laal Singh Chaddha
mictv telugu

అమీర్ ఖాన్ మూవీ ఇండియన్ ఆర్మీని అవమానించింది.. ఇంగ్లండ్ క్రికెటర్

August 13, 2022

బాలీవుడ్‌లో భారీ అంచనాలతోపాటు కాంట్రవర్సీలతో రిలీజ్ అయిన అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ తొలిరోజే నెగటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోగా.. రిలీజైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అమీర్ ఖాన్ గత సినిమాల కంటే కూడా ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. అటు రివ్యూలు కూడా వ్యతిరేకంగా వచ్చాయి.

ఇక ఈ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచీ వ్యతిరేక ప్రచారం జరిగింది. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. గతంలో ఈ దేశంలో సేఫ్టీ లేదు అంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాను బహిష్కరించాలంటూ ప్రచారం గట్టిగా జరిగింది. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ అమీర్ సినిమా పై మండిపడ్డారు. లాల్ సింగ్ చడ్డా ఇండియన్ ఆర్మీని, సిక్కులను దారుణంగా అవమానించిందని ఆయన ఆరోపించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘ఫారెస్ట్ గంప్` అనే సినిమాను అమెరికా ఆర్మీకి పర్వాలేదు, ఇండియన్ ఆర్మీకి మాత్రం ఓకే కాదు. వియత్నాం యుద్ధం కోసం అమెరికా మంద బుద్ది ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంది. కానీ ఈ విషయంలో `లాల్ సింగ్ చడ్డా` ఇండియన్ ఆర్మీని, సిక్కులను అవమానించేలా ఉంది. అంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.