మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు, భార్యకు మూడేళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు, భార్యకు మూడేళ్లు

June 30, 2020

Former French Prime Minister François Fillon jailed

చట్టం ముందు అందరూ సమానులే అని మరోసారి నిరూపించింది ఫ్రాన్స్ రాజధానిలోని పారిస్ కోర్టు. ఆ దేశ‌ మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిల్లోన్‌(66) తన భార్యాపిల్లల కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు పారిస్‌ కోర్టు నిర్ధారించింది. 

దీంతో ఫిల్లోన్‌కు ఐదేళ్లు, ఆయన భార్య పెనెలోప్‌ ఫిల్లన్‌(64)కు మూడేండ్ల పాటు జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు ఇద్దరికీ 4,23,100డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు 4 కోట్లు) చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఆయన పదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఆయన 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ ప్రధానిగా పనిచేశారు. ఆ సమయంలో సొంత భార్యాపిల్లలు తనకు సహాయకులుగా పని చేస్తున్నట్లు చూపించి వారికి 10 లక్షల యూరోల(భారత కరెన్సీలో రూ.8.5 కోట్లు) లబ్ధి కలిగించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. దీనిపై ఫిల్లన్ దంపతులు స్పందిస్తూ..అపీలుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.