అయ్యో రైతన్నా.. వరికుప్ప మీదనే కన్నుమూశావా - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో రైతన్నా.. వరికుప్ప మీదనే కన్నుమూశావా

May 8, 2019

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గోపాల్(50) అనే రైతు వరికుప్ప మీదనే ప్రాణాలు విడిచాడు. చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు గత ఐదు రోజులుగా రైతు పొలం దగ్గరే పడిగాపులు కాస్తున్నాడు. బుధవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గోపాల్ వరి కుప్ప మీదనే కుప్పకూలిపోయాడు.

Former Gopal Dead At Kamareddy District Due to Saling Rice On the farm.

కాగా ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే గోపాల్ మృతి చెందాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసే సిబ్బందితో గొడవకు దిగారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ అధికారులు, సిబ్బంది చేతులు దులిపేసుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను విక్రయించి, చేసిన అప్పులు తీర్చలనుకున్న గోపాల్ మృతితో కుటుంబీకులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.