కరోనా మహమ్మారి సోకి ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు మరణించిన విషయం తెల్సిందే. తాజాగా గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్(92) ఈరోజు కరోనా వైరస్ సోకి మరణించారు. గత నెలలో ఆయన కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు.
దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్ డాక్టర్లు ద్రువీకరించారు. 1995లో, ఆ తర్వాత 1998 నుంచి 2001 వరకు కేశూభాయ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీని వీడిన ఆయన.. స్వంతంగా గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. దీంతో 2014లో ఆ పార్టీని బీజేపీలో కలిపేశారు.