సినిమాలపై మాజీ హీరో కామెంట్స్..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలపై మాజీ హీరో కామెంట్స్..వీడియో వైరల్

May 10, 2022

‘ఆనంద్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హీరో రాజా గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..‘‘శుక్రవారం వచ్చింది మార్నింగ్ షో. ఎంతో ప‌ట్టుద‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేయ‌డానికి కానీ, లాస్ట్ డే మ‌న‌కు దేవుడు చూపిస్తాడు సినిమా అబ్బ‌బ్బా చాలా అద్భుతంగా ఉండ‌బోతుంది. ప్రార్థించ‌డ‌య్యా. ఆ ప‌నికి మాలిన సినిమాలు చూడటం వ‌ల్ల మీకే లాభ‌మూ లేద‌య్యా, గంటసేపు లైన్‌లో నిల్చొని, మూడు గంట‌ల సేపు సినిమాలు చూసే బ‌దులుగా ఆ నాలుగు గంట‌లు మీ త‌ల్లిదండ్రులు, ర‌క్త సంబంధీకులు, మీ బంధువుల కోసం ప్ర‌పంచంలో స‌మాధానం కోసం ప్రార్థ‌న చేయండి. ఇంత చెడుత‌న‌ము మ‌న చుట్టు ప‌క్క‌ల ఉంటుండ‌గా మ‌నం ఏమాత్రం చ‌ల‌నం లేకుండా బ్ర‌త‌కుతున్నామంటే దుష్టుడితో మ‌నం ఫ్రెండ్‌షిప్ చేసుకున్న‌ట్లే’’ అంటూ రాజా అంటున్నారు.

ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ రాజా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘30 సినిమాల దాకా నటించిన నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావ్. ఈ యాక్టింగ్ ఏదో నీ సినిమాల్లో చేసుంటే టాప్‌లో ఉండేవాడివి’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.