కూతురు వయస్సున్న మహిళను పెళ్లాడిన 66 ఏండ్ల మాజీ క్రికెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

కూతురు వయస్సున్న మహిళను పెళ్లాడిన 66 ఏండ్ల మాజీ క్రికెటర్

May 3, 2022

ప్రేమ‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని నిరూపిస్తూ… టీమిండియా మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ 66 ఏండ్ల వ‌య‌స్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు.త‌న కంటే 28 ఏళ్ల త‌క్కువ‌ వ‌య‌స్సున్న బుల్బుల్ సాహా అనే మ‌హిళ‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కోల్ కతా లోని పీర్లెస్ ఇన్ మే 2న సాయంత్రం 7 గంట‌ల‌కు వీరి వివాహం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన‌ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అరుణ్ లాల్ మొదటి భార్య దేబ్జనీ లాల్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తన మొదటి అంగీకారంతోనే అరుణ్ లాల్.. బుల్బుల్ సాహాను పెళ్లి చెసుకున్నట్లు తెలుస్తోంది. ఇక లాల్‌ ప్రస్తుతం బెంగాల్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. లాల్‌ భారత్‌ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్‌.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించాడు.