Former minister B J Puttaswamy to take up 'sanyasa deeksha' on May 6
mictv telugu

నిజంగానే సన్యాసం తీసుకుంటున్న రాజకీయ నేత

May 5, 2022

Former minister B J Puttaswamy to take up 'sanyasa deeksha' on May 6

అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిజ్ఞ‌లు చేసే రాజకీయ నాయకులను చాలా మందిని చూశాం. అవినీతి నిరూపణ కావడమే కాదు, జైలు శిక్షలు పడినా ఏ నేతా సన్యాసం పుచ్చుకోవడంలేదు. కానీ ఎంతోకాలంగా ప్రజాసేవ చేసి, కేబినెట్ హోదాను కూడా అనుభ‌వించిన ఓ బీజేపీ నేత‌ ఆఖరి దశలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. కర్ణాటకలోని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీజే పుట్టస్వామి.. ఈ నెల 6 న (రేపు) సన్యాస దీక్ష తీసుకొని పూర్తిగా రాజకీయ జీవితానికి, వ్యక్తిగత సౌకర్యాలకు దూరం కాబోతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు అత్యంత ఆప్తుల్లో ఒకరైన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ బీజే పుట్టస్వామి.. చాలాకాలం వరకూ కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను నిర్లక్ష్యం చేయడంతో కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు పుట్టస్వామి. అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ హోదా కూడా దక్కింది. అయితే ఇటీవల ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుట్టస్వామి.. తాను సన్యాసం తీసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఈ నెల 6 న సన్యాస దీక్ష చేపట్టిన తర్వాత 15వ తేదిన తైలేశ్వర గాణిగర మహాసంస్థానానికి తొలి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవంలో సీఎం బసవరాజ్‌ బొమ్మైతో పాటు 20కి పైగా మఠాధిపతులు పాల్గొంటారని చెప్పారు.