Home > Featured > ఆస్పత్రిలో కొడాలి నాని..

ఆస్పత్రిలో కొడాలి నాని..

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన కొంతకాలంగా బాధపడుతుండంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కిడ్నీలో రాళ్లు ఉండడంతో ఆయనకు అపోలో వైద్యులు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన్ని పర్యవేక్షిస్తోంది. రెండు వారాల పాటూ విశ్రాంతి తీసుకోవాలని కొడాలినానికి డాక్టర్లు సూచించారు. 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆయన ఐసీయూలో ఉండటంతో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Updated : 19 Nov 2022 1:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top