former minister Kodali Nani spoke on the issue of students failing in the tenth class
mictv telugu

అలా చేస్తే లోకేష్, పవన్‌లా తయారవుతారు – కొడాలి నాని

June 9, 2022

former minister Kodali Nani spoke on the issue of students failing in the tenth class

మానసిక పరిపక్వత ఇంకా రాని పిల్లలకు ఏవేవో చెప్పి వారిని ఆత్మహత్య చేసుకునేలా నారా లోకేశ్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. విద్యార్ధులతో నిర్వహించిన జూమ్ మీటింగులో ఆ దిశగా కొన్ని చర్యలుండడంతో తాను ప్రవేశించానని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నా ఐడీతో వెళ్లి ఉంటే లోకేశ్ నాతో మాట్లాడరు. అందుకే నా మేనల్లుడి లింకు ద్వారా పాల్గొన్నా. అందులో ఆయన ఏం చెప్తున్నా మేం మాట్లాడకుండా ఉండాలా? కరోనా వల్ల పిల్లలు సరిగా చదవలేకపోయారు.

దాంతో పాటు ల్యాప్ టాప్‌లు, ఆన్‌లైన్ క్లాసులు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్ధులు ఫెయిలయ్యారు. వారు మళ్లీ పరీక్ష రాసి పాసయితే డైరెక్ట్ పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తాం. దీని వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అలాగే వారు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉంటుంది. ఈ విషయంలో పేరెంట్స్ తగిన చర్యలు తీసుకోవాలి. రెండు లక్షల మంది ఫెయిలయితే వారిని పాస్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు పాస్ చేస్తే ఇంటర్‌లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. పది గ్రేస్ మార్కులు కలపాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. అవి మాత్రం ఎందుకు? ఒకటో తరగతి నుంచి అందరినీ పాస్ చేయమని అడగాల్సింది. ఈ రకంగా చేస్తే విద్యార్ధులు లోకేశ్, పవన్ కల్యాణ్‌లా తయారవుతారు’ అంటూ సెటైరిక్‌గా వ్యాఖ్యానించారు.