మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

April 14, 2022

16

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకుంది. తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం బూర్గంపాడు మండలం సారపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే తలుపు తీయకపోవడంతో తాళాలు పగులగొట్టి చూడగా మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. విషయం తెలిసిన వెంటనే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట నుంచి సారపాకకు చేరుకున్నారు. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తాటి మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.