జగన్‌కు మా బస్సులే కనిపిస్తయ్..జేసీ వ్యంగ్యం - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు మా బస్సులే కనిపిస్తయ్..జేసీ వ్యంగ్యం

October 23, 2019

Diwakar Reddy .

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన 31 బస్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. జగన్‌కు మాత్రం తన బస్సులు మాత్రమే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు తమ ట్రావెల్స్‌కు చెందిన 31బస్సులను సీజ్ చేశారన్నారు. 

జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తన ట్రావెల్స్‌కు చెందిన బస్సులను భూతద్దంలో చూసి సీజ్‌ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలన జనరంజకంగా సాగుతోందన్నారు. తాను జగన్‌కు 100కు 150 మార్కులు వేస్తానని వ్యాఖ్యానించారు. జగన్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని జేసీ వ్యాఖ్యానించారు. పరిపాలనలో జగన్ కిందామీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు.