ఏపీలో సైకిలే, పవన్ అసెంబ్లీలోకి.. లగడపాటి జోస్యం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో సైకిలే, పవన్ అసెంబ్లీలోకి.. లగడపాటి జోస్యం

May 18, 2019

Former mp lagadapati rajagopal exits polls  predicts tdp win in Andhra Pradesh assembly elections.

ఆంధ్రా ఆక్టోసప్ జోస్యం చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. తన టీమ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈ నెల 19న  వెల్లడిస్తానని చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. కోయిల తొందరపడి పాడినట్లు ముందే పాట పాడేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, తెలంగాణలోని లోక్‌సభకు స్థానాలకు ఎన్నికలపై జోస్యాలు చెప్పేశారు. ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.

ఈ రోజు మీడియాతో లగడపాటి చెప్పింది ఆయ మాటల్లోనే.. ‘ఏపీ లోటు బడ్జెట్‌లో ఉంది కాబట్టి అక్కడి ప్రజలు సైకిలే ఎంచుకున్నారు. తెలంగాణ అధిక బడ్జెట్‌లో ఉంది కాబట్టి అక్కడి వాళ్లు కారు ప్రయాణాన్నే కోరుకుంటున్నారు. ఏపీలో హంగ్ ఏర్పడే అవకాశమే లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి కచ్చితమైన మెజార్టీ వస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న అంచనాలు. గణాంకాలతో రేపు వివరంగా చెబుతాను. మా టీమ్ ఎంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. కాగా, లగడపాటి ఫలితాలను వైకాపా నేతల కొట్టిపడేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంచనాలు గల్లంతయినట్లే ఏపీ ఎన్నికల విషయంలోనూ గల్లంతవుతాయని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు ముగియనుండగా, ఎన్నికల కౌంటింగ్ 23న సాగనుంది.