Home > Featured > కొవ్వెక్కిన కొడుక్కి మరచిపోలేని గుణపాఠం చెప్పిన మాజీ మంత్రి 

కొవ్వెక్కిన కొడుక్కి మరచిపోలేని గుణపాఠం చెప్పిన మాజీ మంత్రి 

former MP Minister Makes Son Clean Garbage for Misbehaving With Police During Lockdown

గ్రామ సర్పంచ్ కొడుకులైనా, కేంద్ర మంత్రుల పుత్రరత్నాలైనా దాదాపు అందరూ ఒకటే బ్యాచ్. ‘మా బాబు పవర్‌లో ఉన్నాడు. నా జోలికొస్తే కసక్. నేను కావాల్సింది ఇవ్వాల్సింది. నేను చెప్పినట్లు చెయ్యాల్సిందే..’ అని బెదిరిస్తుంటారు. మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ దీనికి భిన్నం. తన పేరు చెప్పుకుని పోలీసులపై జులుం ప్రదర్శించిన కొడుక్కి ఆయన జీవితంలో గుర్తిపోయే గుణపాఠం నేర్పారు.

ప్రద్యుమ్న సింగ్ కొడుకు రిపుదమన్ గురువారం బలాదూర్ గా తిరగడానికి బైక్ పై బజారున పడ్డాడు. ముఖానికి కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు పోలీసులు అతణ్ని అడ్డుకుని ప్రశ్నించారు. దీంతో అతడు తెగ రెచ్చిపోయాడు. ‘మా బాబు ఎవరో తెలుసా? మీరెంత? మీ ఉద్యోగాలు ఎంత?’ అని జలుం ప్రదర్శించాడు. ఈ సీన్ ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియలో పెట్టేశారు. అదికాస్తా వైరల్ కావడంతో ప్రద్యమ్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రారా నా కొడుక ఇంటికొస్తే నీ సంగతి చెబుతా’ అని కొడుకు రాగానే క్లాస్ పీకాడు. అంతటితో ఊరుకోలేదు.

పోలీసుల వద్దకు వెళ్లి రిపుదమన్ తో వారికి క్షమాపణ చెప్పించి, జరిమానా కట్టించాడు. తర్వాత కూడా ఊరుకోలేదు. శుక్రవారం రోడ్డుపైకి తీసుకెళ్లి చెత్తాచెదారాన్ని కొడుకుతో ఎత్తించాడు. పుత్రరత్నం కిమ్మనకండా తండ్రి చెప్పినట్లు చేశారు. ఈ వీడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతలు ప్రద్యుమ్నను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

Updated : 2 May 2020 7:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top