మాజీ ఎంపీ, వైసీపీ నేత మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ఎంపీ, వైసీపీ నేత మృతి 

August 11, 2020

Former MP, YCP leader Khaleel basha no more.

కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీ ఖలీల్ బాషా మృతించెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన మరణంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన మృతిపై సానుభూతి తెలిపారు. రేపు (బుధవారం) కడప జిల్లాలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు. కాగా, ఖళీల్ టీడీపీ హాయాంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖామంత్రిగా పనిచేశారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. 

 

కరోనాతో ప్రముఖ కవి మృతి

ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చినట్లు ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను అరబిందో ఆసుపత్రిలో చేర్పించారు. నేడు ఉదయం గుండెనొప్పి రావడంతో వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండాపోయింది. కాగా, ఇండోరీ అరవై శాతం న్యుమోనియాతో బాధపడుతున్నారని, దానికితోడు రెండుసార్లు గుండెపోటు రావడంతో కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.