పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి!

June 10, 2022

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, భారత్‌పై నిత్యం కాలు దువ్వి సరిహద్దుల్లో మారణ హోమాలు సృష్టించిన నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం చనిపోయాడని సమాచారం.  తీవ్ర అనార్యోగానికి దుబాయ్‌లో చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడని గల్ప్ నుంచి వార్తలు వస్తుస్నాయి. అయితే ఇంకా చనిపోలేదని, కొద్ది గంటల్లో చనిపోవచ్చని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ముషారఫ్ వయసు 78 ఏళ్లు. పలు అవినీతి, అధికార దుర్వినియోగం కేసుల్లో దోషిగా తేలిన ముషారఫ్ కొన్నేళ్లుగా ప్రావాసంలో గడుపుడుతున్నాడు. మళ్లీ పాకిస్తాన్ వెళ్లి రాజకీయాల్లోకి రావాలని కలలుగనేవాడు. కార్గిల్ యుద్ధాన్ని ఎగదోసి భారత్‌కు వేధించిన కజ్జాకోరుగా చరిత్రలో మిగిలిపోయాడు.
ముషారఫ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షునిగా పనిచేశాడు. 2007లో దేశంలో ఎమర్జెన్సీ విధించి, సుప్రీం కోర్టు జడ్జీలను ఖైదు చేసి, హక్కుల మొత్తం కాలరాశాడు. ఈ కేసులో అశంసనను తప్పించుకోవడానికి పదవి నుంచి వైదొలగాడు. దేశద్రోహం కేసులో అతనికి మరణశిక్ష కూడా పడింది. ఢిల్లీలో పుట్టిన ముషారఫ్ దేశ విభజనతో పాక్ వెళ్లిపోయాడు. బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ చదువుకున్నాడు. 1961లో పాకిస్తాన్ మిలిటరీలో చేరి ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో చురుగ్గా పాల్గొన్నాడు. సైన్యంలో తనకు అనుకూలంగా కుట్ర లేవదీసి అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు.