Former PCC president Ponnala Lakshmaiah criticized PM Modi on Vande Bharat
mictv telugu

‘వందే భారత్ అంటే.. జెండా ఊపి రైళ్లు ప్రారంభించడమా?’.. పొన్నాల

January 15, 2023

Former PCC president Ponnala Lakshmaiah criticized PM Modi on Vande Bharat

ప్రధాని నరేంద్రమోడీ నేడు… సికింద్రాబాద్, విశాఖ పట్టణాల మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా.. తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక అంటూ ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను జేండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, గవర్నర్ తమిళి సై కూడా హాజరయ్యారు. అయితే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించడంపై మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య.. పీఎం మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల విషయాలను మరుగును పెట్టడానికి అవసరమైన కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు , కొత్త నినాదాలు , ప్రచారాలు , ప్రారంభోత్సవాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

“పండగపూట రాజకీయాల మాట్లాడకూడదు అనుకున్న కానీ పండగ రోజే రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి, కేంద్రమంత్రి, గవర్నర్.. అందరూ ఒక రైలుకు సంబంధించిన అంశం మీద విస్తృత ప్రచారం చేశారు. ప్రయాణికులని సికింద్రాబాద్ నుండి వైజాగ్ పంపించడానికి వందే భారత్ రైలు ఏదో మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని, మంత్రులు, గవర్నర్ ఆర్భాటాలు చేశారు. ఇది మొదటి ట్రైన్ కాదు కదా ? ఇప్పటికే 17 ట్రైన్స్ ఉన్నాయి ఇది 18వ ట్రైన్.. 18వ ట్రైన్ ప్రారంభానికి ఇంత ఆర్భాటాలు.. ప్రచారాలు.. ఎందుకో చెప్పాలి ? ఇది సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ట్రైన్ కాదు కదా” అని దుమ్మెత్తి పోశారు.

రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని అంశాలు 8 సంవత్సరాల లో ఏ ఒక్కటి అయినా నెరవేర్చారా ? అని ప్రశ్నించారు పొన్నాల. విభజన చట్టంలోని అంశాలు మీ ప్రభుత్వం ఉండి కూడా అమలు చేస్తున్నారా> అమలు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ఈ పర్వదినాన రెండు రాష్ట్రాల ప్రజలకు మేము ఇది చేస్తున్నాము అని చెప్పుకుంటే ఎంత బాగుండేది. మీరు దక్షిణాదికి, తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నేను రాజకీయ కోణంలో విభజించడానికి ఈ మాటలు చెప్పడం లేదు. వందే భారత్ లో ఏం చేసావ్ అయ్యా మోడీ ఒక జెండా ఊపి ట్రైన్ ప్రారంభించడమా.? మిమ్మల్ని ప్రజలు దేవుడు క్షమించడు. ఏదో మేలు చేస్తున్నాడు అని నటించే మోడీ , బీజేపీకి తెలుగు రాష్ట్రాల ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.