ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లిపోయారు..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లిపోయారు.. 

August 13, 2020

Former President Pranab Mukherjee in coma, vital parametres stable.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో అనేక వదంతులు వినబడుతున్నాయి. కొందరైతే అప్పుడే అతి పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ప్రణబ్ కొడుకు అభిజిత్ స్పందించారు. తన తండ్రి ఇంకా బతికే ఉన్నారని.. దయచేసి ఇలాంటి వదంతులు వ్యాపింపజేయవద్దని కోరారు. హెమోడైనమికల్‌గా ఇంకా నిలకడగా ఉన్నారని ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదిలావుండగా తాజాగా ఆయనకు వైద్యం అందిస్తున్నఆర్మీ రీసెర్చ్ రిఫెరల్ ఆసుపత్రి ఆయన ఆరోగ్యం గురించి ఓ ప్రకటన చేసింది. ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం కోమాలో ఉన్నారని.. ఆయనకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ఆయన శరీరంలో ముఖ్య అవయవాలు పని చేస్తున్నాయని వెల్లడించింది. ఆయన ఆరోగ్యం హిమోడైనమికల్లీ స్టేబుల్ అని పేర్కొన్నారు. 

హిమోడైనమికల్లీ స్టేబుల్ అంటే..

హిమోడైనమికల్లీ స్టేబుల్‌పై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. హిమోడైనమికల్లీ స్టేబుల్‌లో పేషెంట్‌ బీపీ, గుండె కొట్టుకునే వేగాన్ని వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. రక్తంలో ఆక్సిజన్ శాంతం ఎంత ఉందో మానిటర్ చేస్తుంటారు. హిమోడైనమికల్లీ అన్‌స్టేబుల్ అంటే పైన పేర్కొన్న లక్షణాలు ఉంటాయి. హిమోడైనమికల్లీ స్టేబుల్ అంటే ఆ పేషెంట్ బతికే ఉంటారు. కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్‌గా ఉంటుంది.