ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై - MicTv.in - Telugu News
mictv telugu

ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై

August 11, 2020

Former President Pranab Mukherjee on ventilator support

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్రణబ్ ముఖర్జీ(84) కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ కోసం ఆయన సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరారు. 

అక్కడ డాక్టర్ల సూచన మేరకు ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. అందులో కరోనా పాజిటివ్ తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. తరువాత ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అవడంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు.