ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సింగ్

August 23, 2019

 

మన దేశనికి రెండు పర్యాయాలు ప్రధానిగా సేవలందించిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ ఈసారి రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 1991 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.