శ్రీలంక మాజీ ప్రధానికి.. ఫోర్ట్ మెజిస్ట్రేట్ గట్టి షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంక మాజీ ప్రధానికి.. ఫోర్ట్ మెజిస్ట్రేట్ గట్టి షాక్

May 12, 2022

శ్రీలంక దేశంలో ఆర్ధిక, ఆహార సంక్షోభం కారణంగా గతకొన్ని నెలలుగా ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు తీవ్రమైన ఆందోళనలు, నిరనలు చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో ప్రధాని మహింద రాజపక్స ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికి ఆయనపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ, దాడి చేయడానికి ప్రయత్నించారు.

దాంతో మహింద విదేశాలకు వెళ్లి, తలదాచుకోవాలని ఏర్పాట్లు సిద్దం చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు మహింద రాజపక్స గట్టిషాక్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లకుండా ఆయన ప్రయాణలపై నిషేధాన్ని విధించింది. మహీందతోపాటు ఆయన కుమారుడు, ఎంపీ నమల్ రాజపక్స, మరో 15 మంది మద్దతుదారులపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వూలు జరీ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపై మహీంద, తన మద్దతుదారులతో దాడి చేయించారని ఆరోపణలు రావడంతో మహీంద, ఆయన మద్దతుదారులపై ప్రయాణ నిషేధం విధించాలని అటార్నీ జనరల్ కోరారు. దాంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది.

మరోపక్క ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటికీ మహీందకు తీవ్రమైన నిరసన సెగ తగలడంతో ఆయనపై దాడి చేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. దాంతో అత్యంత భద్రత నడుమ మహీందను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ నౌకాదళ స్థావరంలో తలదాచుకున్నట్లు అక్కడి మీడియాలు కథనాలను వెల్లడించాయి.