Former Punjab CM Captain Amarinder Singh to merge his PLC in bjp
mictv telugu

కాంగ్రెస్ మాజీ సీఎం బీజేపీలోకి జంప్..

September 16, 2022

Former Punjab CM Captain Amarinder Singh to merge his PLC in bjp

బీజేపీ ఆకర్ష్ వలలో చిన్న చేపలే కాదు భారీ తిమింగలాలు కూడా పడుతున్నాయి. మాజీ కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 19న ఆయన తన పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ను బీజేపీలో విలీనం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ తంతు జరగనుంది. కాంగ్రెస్ అంతర్గత గొడవలతో సీఎం పదవి నుంచి తప్పుకున్న 80 ఏళ్ల అమరీందర్ తర్వాత సొంత కుంపటి పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలవలేదు.

పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీతోపాటు ఆయన సోమవారం ఢిల్లీలో కషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల విదేశాల్లో వెన్నుముకకు ఆపరేషన్ చేయించుకునన్న కెప్టెన్ అక్కడి నుంచి వచ్చాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యి విలీనంపై చర్చలు జరిపారు.