లిక్కర్ కింగ్ విత్ యూనివర్స్ బాస్.. ట్వీట్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

లిక్కర్ కింగ్ విత్ యూనివర్స్ బాస్.. ట్వీట్ వైరల్

June 22, 2022

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌ను విజయ్ మాల్యా కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపింది. గేల్‌తో కలిసి దిగిన ఫొటోని మాల్యా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్, యూనివర్స్ బాస్‌ను కలుసుకోవడం చాలా బాగుంది. నేను అతడిని బెంగళూరు జట్టుకి తీసుకున్నప్పటి నుంచి మంచి స్నేహం ఏర్పడింది. గేల్‌ని జట్టులోకి తీసుకోవడం ఎప్పటికీ బెస్ట్ సెలక్షన్’ అంటూ ట్వీట్ చేశారు.
ఒక‌ప్పుడు ఐపీఎల్‌లో బెంగుళూరు జ‌ట్టుకు ఓన‌ర్‌గా మాల్యా ఉన్న స‌మ‌యంలో.. ఆ జ‌ట్టుకే క్రిస్ గేల్ ఆడేవాడు. 2011 నుంచి 2017 సీజ‌న్ వ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు జ‌ట్టుకు యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వ‌హించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను చూసిన నెటిజన్లు.. ‘లిక్కర్‌ కింగ్‌ విత్‌ యూనివర్స్‌ బాస్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.