జస్ట్ ఇలా చేయి చేజారిందంటే గుడ్డు ముక్కలవుతుంది. కానీ ఓ గుడ్డు అంతరిక్షం నుంచి పడినా చెక్కు చెదరలేదు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. చేసి చూపించాడు ఓ యూ ట్యూబర్. నాసా మాజీ సైంటిస్ట్, ప్రస్తుత యూట్యూబర్ మార్క్ రాబర్ ఈ ప్రయాగాన్ని చేసి ఆశ్చర్యపరిచాడు. నాసాలోనూ, యాపిల్ సంస్థలోనూ గతంలో పనిచేసిన మార్క్ రాబర్ అనే యూట్యూబర్ విభిన్నరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అందులో భాగంగా గుడ్డును పై నుంచి సేఫ్గా కిందకు చేర్చాలని అనుకున్నాడు. దానికి తగట్టుగా పని మొదలు పెట్టాడు. మనం షాపు నుంచి గుడ్డు తెచ్చేటప్పుడే ఎక్కడ చేజారితే పగిలిపోతుందని వంద జాగ్రత్తలు తీసుకుంటాం. మార్క్ రాబర్ కూడా తన జాగ్రత్తలను పాటించాడు. కోడిగుడ్డు సేఫ్గా ఉండటానికి కాంట్రాప్షన్ను క్రియేట్ చేశారు.
మొదట గుడ్డును క్షేమంగా కిందకు ల్యాండ్ చేయాలని మార్క్ రాబర్ టీం ప్రయోగం చేపట్టింది. తర్వాత అది అంతకంతకు పెరిగి చివరికి అంతరిక్షానికి చేరింది. అనుకున్న ఎత్తుకు చేరిన తర్వాత అక్కడి నుంచి దాన్ని భూమి మీదకు వదిలారు. భూమి మీదకు వదిలిన కోడిగుడ్డు ఎక్కడ ఉందా.. అని వెతుక్కుంటూ వెళ్లి మరీ చూశాడు. అయితే ఆ గుడ్డు పగిలిపోకుండా అలానే ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీని మొత్తాన్ని 26 నిమిషాల వీడియోగా యూట్యూబ్లో పెట్టారు. 2 రోజుల్లోనే ఈ వీడియోకు 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది.