Former Supreme Court Judge Abdul Nazeer Appointed As Governor Of Andhra Pradesh
mictv telugu

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్.. బిశ్వ‌భూష‌ణ్ ఛత్తీస్‌గఢ్‌కు

February 12, 2023

Former Supreme Court Judge Abdul Nazeer Appointed As Governor Of Andhra Pradesh

పలు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌ నియమితులయ్యారు.

జస్టిస్ నజీర్ ఫిబ్రవరి 2017లో కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జీగా.. కేఎస్ పుట్టస్వామి కేసు, ట్రిపుల్ తలాక్ కేసు, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ తీర్పు, నోట్ల రద్దు కేసు వంటి ప్రముఖ తీర్పులలో భాగమయ్యారు. ఆర్టికల్ 19(2)లో లేని అదనపు పరిమితులను మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వాక్ స్వాతంత్య్ర హక్కుపై విధించలేమన్న తీర్పులో కూడా ఆయన నాయకత్వం వహించారు.

కొత్త  గవర్నర్ల వీరే..
ఆంధ్రప్రదేశ్‌ – జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
ఛత్తీస్‌గఢ్‌ – బిశ్వభూషణ్‌ హరిచందన్‌
మహారాష్ట్ర – రమేశ్‌ బైస్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ – శివ్‌ ప్రతాప్‌ శుక్లా
అరుణాచల్‌ప్రదేశ్‌ – లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌
సిక్కిం – లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య
ఝార్ఖండ్‌ – సి.పి. రాధాకృష్ణన్‌
అసోం – గులాబ్‌ చంద్‌ కటారియా
మణిపూర్‌ – అనుసూయ
నాగాలాండ్‌ – గణేశన్‌
మేఘాలయ – ఫాగు చౌహాన్‌
బిహార్ – రాజేంద్ర విశ్వనాథ్‌
లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ – బీడీ మిశ్రా