భార్య అనుమతితో రెండో పెళ్లికి సిద్ధపడిన టీమిండియా మాజీ క్రికెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

భార్య అనుమతితో రెండో పెళ్లికి సిద్ధపడిన టీమిండియా మాజీ క్రికెటర్

April 25, 2022

అరుణ్ లాల్ అనే టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు ప్రధాన కోచ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. 66 ఏళ్ల వయసున్న అరుణ్ లాల్ 38 ఏళ్ల వయసున్న బుల్ బుల్ సాహను మే 2న వివాహమాడనున్నారు. ఇందుకు మొదటి భార్య రీనా అనుమతి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రికలను బంధువులకు, స్నేహితులకు ఇప్పటికే పంపించాడు. అరుణ్ లాల్ 1982 – 89 మధ్య భారత్ తరపున 16 వన్డేలు, 16 టెస్టులు ఆడాడు. 156 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 30 సెంచరీలతో పదివేలకు పైగా పరుగులు సాధించాడు. కాగా, మొదటి భార్య రీనా అనారోగ్యం కారణంగా అరుణ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా ఇప్పటికే రీనాకు విడాకులు ఇవ్వగా, రీనా తన అనారోగ్యం దృష్ట్యా మంచానికే పరిమితం కావడంతో అరుణ్ లాల్ వద్దే ఉంటోంది. రీనాకు కూడా బుల్ బుల్ సాహతో మంచి సంబంధాలే ఉన్నాయని సన్నిహితులు చెప్తున్నారు.