Former Telangana MP Rapolu Ananda Bhaskar resigned bjp
mictv telugu

బీజేపీకి రాపోలు రాజీనామా.. గులాబీ గూటికి..

October 26, 2022

Former Telangana MP Rapolu Ananda Bhaskar resigned bjp

మునుగోడు ఉప ఎన్నికలు కీలక పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. జంపింగ్ జంపాగ్స్ ఊపందుకున్నాయి. తాజాగా రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. వసుదైక కుటుంబం అని చెబుతున్న బీజేపీలో వాస్తవానికి ఆ స్ఫూరిలేదని విమర్శించారు. ప్రాంతీయపరైమైన, భాషాపరమైన అస్తిత్వాలను బీజేపీ గౌరవించడం లేదని రాపోలు విమర్శించారు.

మోదీ ప్రభుత్వం విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని, పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. రాపోలు ఆదివారం ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుసుకుని ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించి, బీజేపీని విమర్శించారు. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ఆఫీసులో చిన్న ఉద్యోగిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎంపీ స్థాయికి ఎదిగారు. రాజ్యసభ పదవీ కాలం ముగియగానే మూడేళ్ల కింద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన పరిస్థితిని బట్టి బీజేపీ నుంచి బయటపడిన ఆయన సాయంత్రం టీఆర్ఎస్‌లో చేరనున్నారు.