Former TRS MP Boora Narsaiah Goud joined BJP in delhi
mictv telugu

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

October 19, 2022

భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వగా, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డా. కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదం నచ్చి పార్టీలో చేరానని వెల్లడించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కరిది కాదని, అందరిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, దేశం అభివృద్ధి కోసమే పార్టీ మారానని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.