బెయిల్‌పై టీవీ9 రవిప్రకాష్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

బెయిల్‌పై టీవీ9 రవిప్రకాష్ విడుదల

October 26, 2019

ravi prakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చంచల్‌గుడా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. రవిప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేయాలని కుకట్‌పల్లి కోర్టును హైకోర్టు ఆదేశించింది. పదిహేనువేల పూచికత్తు, ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 

రవిప్రకాష్‌పై మూడు కేసులున్నాయి. టీవీ9 సంస్థ నిధులను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్పీసీ నోటీసులిచ్చారు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరుపై ఫేక్ ఐడి కార్డు సృష్టించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.