సూట్‌కేసుల నిండా డబ్బు.. దేశం దాటుతూ దొరికిపోయిన మాజీ ఎంపీ భార్య - MicTv.in - Telugu News
mictv telugu

సూట్‌కేసుల నిండా డబ్బు.. దేశం దాటుతూ దొరికిపోయిన మాజీ ఎంపీ భార్య

March 21, 2022

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న సందర్భంలో చాలా మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని వదిలి సరిహద్దు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు ఇలా దాదాపు కోటి మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యలో ఆ దేశ మాజీ ఎంపీ కోట్విట్స్కీ భార్య సూట్‌కేస్ నిండా డబ్బులతో పారిపోతూ, హంగేరీ దేశ సరిహద్దు వద్ద జవాన్లుకు దొరికిపోయింది. ఆమె వద్ద 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ల యూరోలు దొరికాయి. అంత భారీ మొత్తంలో డబ్బు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, యుద్ధం నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న మగవారు ఎవ్వరూ దేశం విడిచి వెళ్లకూడదనే ఆంక్షలు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్నాయి. ఆడవారు, చిన్న పిల్లలు, తీవ్ర వ్యాధులున్నవారు మాత్రమే దేశం దాటేందుకు అవకాశం ఉంది. మరోవైపు యుద్ధం ఆపడానికి చేసిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితాలనివ్వకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది.