కోససీమకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పు.. మాజీ దళిత ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

కోససీమకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పు.. మాజీ దళిత ఎంపీ

May 28, 2022

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్‌ పేరు పెట్టి.. లేనిపోని విధ్వంసాలకు వైసీపీ ప్రభుత్వం కారణమైందని అన్నారు. అంబేద్కర్ ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని… ప్రపంచ మేధావి అని తెలిపారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నానని… కులాల మధ్య చిచ్చుకు కుట్ర ఇది అని మండిపడ్డారు. పేద కాలనీలకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక ప్రేమ ఉంటుందని ఆయన తెలిపారు.

సామాజిక న్యాయం పేరుతో జగన్ సర్కార్ అన్యాయం చేస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్షిప్‌ను పూర్తిగా తీసేయటం అన్యాయమని మండిపడ్డారు. ఓటేసిన ప్రజలకు ప్రభుత్వం సరైన సదుపాయాలు, ప్రాథమిక వసతలు కల్పించడమనేది బాధ్యతని అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే దానికి నీ దీవెన పేరు ఏమిటని సీఎం జగన్ పై మండిపడ్డారు. నీవు చదివింది ఏంది? నీవు దీవించేది ఏంది? దీవించేందుకు నీకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు.