Former Vice President Venkaiah Naidu opined that releasing Rajiv Gandhi's killers is wrong.
mictv telugu

రాజీవ్‌గాంధీ హంతకులను వదిలేయడం కరెక్ట్ కాదు

November 14, 2022

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేయటం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హంతకులపై సానుభూతి అవసరం లేదని అన్నారు. వారిని విడుదల చేయటం తన మనసుని కలచివేసిందని చెప్పారు. ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయాలు వేర్వేరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకోవాలని ఆయన సూచించారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులు నళిని శ్రీహరన్, రాబర్ట్ పేస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్‌లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల అనంతరం తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి ఆదివారం విడుదల చేశారు. 1991లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాలన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.