former White House physician Ronny Jackson tweet about Biden's cognitive health
mictv telugu

బైడెన్ ముసలోడు అయ్యాడు.. ఆయనతో కష్టమే ఇక’

July 17, 2022

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‍.. పూర్తి కాలం పనిచేయలేడని, అతని శరీరం అందుకు సహకరించదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైట్‌హౌస్‌ మాజీ ఫిజీషియన్‌ రోనీ జాక్సన్‌. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్.. మధ్యలోనే వైదొలుగుతారని జోస్యం చెప్పారు. సోషల్ మీడియాలో జో బైడెన్ ఆరోగ్యంపై ట్వీట్ చేసిన రోనీ జాక్సన్.. ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకూడదని, బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మైండ్ ఎక్కడికో వెళ్లిపోందని అన్నారు.పలువురు అమెరికా మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఫిజీషియన్‍గా సేవలందించారు రోనీ. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్‌ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

అయితే బైడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు చూసి బరాక్‌ ఒబామా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ మీడియా ఛానల్‍కు రోని వెల్లడించారు. వైట్ హౌస్‌లో గొప్ప బాధ్యతలు నిర్వహించి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సబబు కాదన్నారని చెప్పారు. రోనీ ప్రస్తుతం టెక్సాస్‌ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.