డైనోసార్ అస్థిపంజరానికి కళ్లు తిరిగే ధర.. - MicTv.in - Telugu News
mictv telugu

డైనోసార్ అస్థిపంజరానికి కళ్లు తిరిగే ధర..

May 14, 2022

రెండేళ్ల పాటు జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఓ అరుదైన డైనోసర్ అస్థిపంజరం బయటపడింది. 4 అడుగుల ఎత్తు, 10 అడుగుల పొడువు , మొత్తం 126 ఎముకలతో ఉన్న ఆ అస్థిపంజరం పూర్తి ఆకారంలో ఉండడం చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. జురాసిక్‌ పార్క్‌ చిత్రంలో కిచెన్‌లో పిల్లలను వెంటాడే రాక్షస బల్లి అచ్చం ఇలాంటిదేనట. దాదాపు 11 కోట్ల ఏళ్ల నాటి ఆ అస్థిపంజరాన్ని వేలం వేయగా.. భారీ ధర పలికింది.

ఎంతంటే వేలం వేసినవాళ్లు కూడా ఊహించనంతగా. 2012 నుంచి 2014 మధ్య అమెరికాలోని మోంటానాలో ఉన్న వూల్ఫ్‌ లోయలో పురావస్తు శాస్త్రవేత్తలు రాక్, రాబర్ట్‌ ఓవన్‌ జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇందులో పుర్రె భాగంలో చాలా వరకు, ఎముకల్లో కొన్నింటిని మళ్లీ కొత్తగా రూపొందించారు. వేలంలో ఈ అస్థిపంజరాన్ని రూ.96 కోట్లకు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. ప్రపంచంలో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద ఉన్న ఒకే ఒక్క డైనోసార్‌ అస్థిపంజరం ఇదే. అయితే ఇంత ధర పెట్టి ఈ అస్థిపంజరాన్ని ఎవరు కొన్నారో మాత్రం వేలం వేసిన వారు చెప్పలేదు.