సిరిసిల్లలో శంకుస్థాపనలు.. - MicTv.in - Telugu News
mictv telugu

సిరిసిల్లలో శంకుస్థాపనలు..

August 22, 2017

సిరిసిల్లలోని ఏరియా ఆస్పత్రిలో ICU,  డయాలిసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, లేబర్ రూమ్స్ ను  ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆస్పత్రిలోని  ఆయా విభాగాలను పరిశీలించి, రోగులను పరామర్శించారు. అనంతరం నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.

సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాలులో జరిగిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు అమలు అవులతున్నాయని, సీఎం కేసీఆర్ దార్శనికతతో బంగారు తెలంగాణను ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ‘సిరిసిల్ల లో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తాం.  డయాగ్నొస్టిక్ సెంటర్ ని ఏర్పాటు చేసి, అన్ని వైద్య పరీక్షలు ఒకే చోట జరిగే విధంగా చూస్తాం.  జనరిక్ మందుల తయారీ పరిశ్రమను జన-ఔషధిని కూడా ఏర్పాటు చేస్తాం’ అని లక్ష్మారెడ్డి చెప్పారు.

సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా అద్భుత అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయని, సిరిసిల్లలో రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో ‘నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు.. ’ అనే అన్నవాళ్లు ఇప్పడు ‘నేనొస్త బిడ్డో సర్కార్ దవాఖానకు’ అని అంటున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానాల మీద నమ్మకం పెరిగిందని, కేసీఆర్ కిట్ల పథకం తో 40 శాతానికి మించి ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు.