నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్‌వాయి మండలం చాంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఓ కారు అతివేగంతో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు వెళుతున్న కారు అతివేగంగా ముందున్న భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదానికి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వాహనాన్ని వేగంగా నడపడమే కారణమని, మృతులు నలుగురు పురుషులుగా గుర్తించారు.