Four elected for Rajya Sabha from Andhra Pradesh ysr congress party
mictv telugu

కృష్ణయ్య సహా రాజ్యసభకు నలుగురు ఎన్నిక

June 3, 2022

Four  elected for Rajya Sabha from Andhra Pradesh ysr congress party

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య, వ్యాపారవేత్త బీద మస్తాన్‌రావు, న్యాయవాది నిరంజన్‌ రెడ్డి గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి ఈమేరకు వారికి పత్రాలు అందజేశారు. పార్టీ అధినేత జగన్ తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటామని, ప్రజల కోసం పనిచేస్తామని ఈ నలుగురు మీడియాతో చెప్పారు.
తెలంగాణలోని వికారాబాద్‌కు చెందిన కృష్ణయ్య బీసీల కోసం ఉద్యమించారు. 2014లో టీడీపీ తరఫున ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ రావు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. రొయ్యల పరిశ్రమలో బాగా సంపాదించారు. నెల్లూరు జిల్లాకే చెందిన విజయసాయిరెడ్డి చార్టెడ్‌ అకౌంటెంట్‌ పనిచేసి అక్రమాస్తుల కేసులో జగన్‌కు అండగా నిలిచారు. అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు చెందిన నిరంజన్ రెడ్డి సీనియర్ న్యాయవాది.